మనుబోలు మండలంలోని వడ్లపూడి అటవీ ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ శివ రాకేష్ తన సిబ్బందితో కలిసి గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక కోడిపుంజు, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు, పేకాట వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.