మాజీ మంత్రి వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే

తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచిత సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు, విద్యుత్, తాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి కనిపించడం లేదన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ, చేసిన పనులన్నీ చూపించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్