మనుబోలులో ఇంధన కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికంగా ఉన్న నాలుగు పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిండుకోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం భారత్ పెట్రోలియం బంకుకు ఇంధనం చేరడంతో వాహనదారులు భారీగా తరలివచ్చారు. అయితే, ఒక్కో వాహనానికి రూ. 1000 వరకే ఇంధనం అందిస్తుండటంతో నిర్వాహకులు, వాహనదారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.