ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ మొలక పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్థానిక గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్పులు, మేళతాళాలు, యువత కేరింతలతో కృష్ణపట్నం గ్రామం సందడిగా మారింది.