నెల్లూరు: లైంగిక దాడి కేసులో ఒకరు అరెస్టు

మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిని అరెస్టు చేసినట్లు సోమవారం ఎస్సై రాకేశ్ తెలిపారు. ఇటీవల మనుబోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వైకల్యం కలిగిన మహిళపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు బుడగ పెంచలయ్య మద్యం మత్తులో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్