మనుబోలు మండలం బద్దెవోలులోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు సురేంద్ర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, ఏకరుద్రాభిషేకం, సుగంధద్రవ్యభిషేకం, నూతన వస్త్రధారణ, పుష్పాలంకరణ, కుంకుమార్చన వంటివి అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.