పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామ సమీపంలో నావూరు గ్రామానికి చెందిన ఇమ్మడి శెట్టి పెంచలయ్య అనే రైతుకు చెందిన నాలుగు బర్రెలు ఆదివారం విద్యుత్ తీగలు తగలడంతో మృతి చెందాయి. వాటి విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని రైతు వాపోయాడు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు పొలాల్లో విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. దీంతో తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.