పొదలకూరు మండలం ఇనుకుర్తిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఆయనకు స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాల గురించి ప్రజలకు సోమిరెడ్డి వివరించారు.