నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెంలో సోమవారం రాత్రి ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారానికి చెందిన టి. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.