మనుబోలు వద్ద రోడ్డు ప్రమాదం

మనుబోలు మండలం బద్వేల్ క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. చెన్నై వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్