సర్వేపల్లి: రూ. 1. 50 కోట్లతో సోలార్ వీధిదీపాల ప్రారంభం

సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం పంచాయతీలో రూ. 1.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సోలార్ వీధిదీపాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, గిరిజన కాలనీల అభివృద్ధికి సహకరిస్తున్న కంపెనీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 18 జట్లు పాల్గొన్న క్రికెట్ టోర్నీలో విజేతలకు రూ. 30 వేలు, రన్నర్స్‌కు రూ. 20 వేలు బహుమతులు అందించి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ. 7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్