సర్వేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనుబోలు మండలం బద్దెవోలు పంచాయతీ పల్లిపాలెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున మోటార్ సైకిల్‌పై వెళ్తున్న యువకుడు గేదెను ఢీకొట్టాడు. అదుపుతప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతుడు గంగ పట్టణానికి చెందిన లక్ష్మయ్య (22) కాగా, రొయ్యల గుంటల వద్ద పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్