సోమిరెడ్డి బహిరంగ చర్చకు వస్తే ఇప్పటికీ సిద్ధమే – కాకాణి

రైతుల సమస్యలు, ప్రాంత అభివృద్ధి పట్ల మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పొదలకూరులో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బహిరంగ చర్చకు సిద్ధమని సోమిరెడ్డి సవాల్ విసిరారని, తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత మాత్రం వెనక్కి తగ్గారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా అభివృద్ధి, అవినీతి అంశాలపై బహిరంగ చర్చకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్