మనుబోలు మండలం పిడురుపాలెం కొత్తూరులోని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం అర్చకుల ఆధ్వర్యంలో పూజలు, పంచామృత అభిషేకం, నూతన వస్త్రధారణ, పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం సీతారామ కళ్యాణం, మధ్యాహ్నం అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణం వీక్షించి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ వార్త శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, సర్వేపల్లి ప్రాంతానికి సంబంధించినది.