కసుమూరు దర్గాలో రాష్ట్ర ప్రముఖులు

కసుమూరు దర్గాలో లంగర్ ఖానా (అన్నదానం) మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. భక్తులకు నిత్య అన్నదానం అందించడంతో పాటు, యువతకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్