ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో రెండు స్వర్ణ పతకాలు గెలిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా నిలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటడం హర్షనీయమన్నారు.