శుక్రవారం టీపీ గూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్ (34), ప్రమీలమ్మ (28) దంపతులు ఇంట్లోనే ఒకే చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భార్యాభర్తలు విడిపోకుండా కలిసి మరణించడం అందరినీ కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.