కసుమూరు రోడ్డు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వెంకటాచలంకు చెందిన వేదగిరి స్వయం ప్రకాశ్ (61) బుధవారం మృతి చెందారు. వెంకటాచలం సమీపంలోని ఒక కళాశాలలో పని చేస్తున్న ప్రకాశ్ ద్విచక్రవాహనంపై విధులకు వెళుతుండగా.. కసుమూరు రోడ్డు దాటగానే ఎదురుగా వేగంగా వచ్చిన మరొక ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.