వెంకటాచలం: '70 లక్షల విలువైన సౌకర్యాలు కల్పించాం'

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయి గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో రూ. 70 లక్షల విలువైన సౌకర్యాలు కల్పించామని, వైద్యులు, కమిటీ సభ్యుల అంకితభావంతో 84.29 శాతం స్కోరుతో క్వాలిటీ సర్టిఫికేషన్ వచ్చిందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్