జలదంకిలో నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో జలదంకి మండలంలోని 17 పంచాయతీలలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి సూచించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను నాలుగు దశల్లో అమలు చేస్తూ చెరువులు, కాల్వలు శుభ్రపరచడం, పూడికలు తొలగించడం, చెక్‌డ్యాంల మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ చర్యలతో నీటి నిల్వ పెరిగి వరద ముప్పు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్