పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2. 0 కార్యక్రమం సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం కలిగిరి మండలంలోని మోడల్ హైస్కూల్, వింజమూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు.