కలిగిరి: బైకు ఢీకొని వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా కలిగిరి- సంఘం ప్రధాన రహదారిపై వెలగపాడు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తిని ఓ మోటార్ బైక్ ఢీకొట్టింది. గాయపడ్డ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని స్వగ్రామం ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన కురిచేడుగా గుర్తించారు. ఈ ఘటనపై కలిగిరి ఎస్సై ఉమాశంకర్ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్