వరికుంటపాడులోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు కరెంటు వైర్లు, ఫ్యాన్లు దొంగిలించేందుకు ప్రయత్నించారు. అయితే, సమాచారం అందుకున్న పూర్వ విద్యార్థులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో దొంగలు పరారయ్యారు. దీంతో పెద్ద నష్టం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంఈవో అన్ని పాఠశాలల హెచ్‌ఎంలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.