నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఉదయగిరి లోని అల్కార్ ఫంక్షన్ హాల్ లో హమీద్ అనే వ్యక్తి శుక్రవారం హత్యకు గురయ్యాడు. ఇద్దరు యువకులు ఇనుపరాడ్, కత్తులతో దాడి చేయడంతో సంఘటన స్థలంలోనే హమీద్ మృతి చెందాడు. ఆల్కార్ ఫంక్షన్ హాల్ నిర్వహణ, ఆర్థిక వ్యవహారంలో వివాదాలు జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.