వరికుంటపాడు మండలం గొల్లపల్లి సంగం ఎస్టీ కాలనిలో మంగళవారం రాత్రి పిడుగు పడటంతో రైతు ఆవుల బాలయ్యకు చెందిన గేదె మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. జీవనాధారమైన గేదెను కోల్పోవడంతో రైతు ఆవుల బాలయ్యకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబం కోరుతోంది.