చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించారు. తల్లిదండ్రుల కోసం రంగోలి, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సునీతమ్మ, గ్రామ సర్పంచ్, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.