నెల్లూర్ జిల్లా వరికుంటపాడు మండలంలోని పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాలకు వెనుక వైపు కనుచూపుమేరలో ఉన్న పొలంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. మనిషి చెయ్యత్తకుండా నిలబడినా తగిలే అంత ఎత్తులో వైర్లు ఉండడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఆదమరిచినా ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. వేలాడుతున్న తీగలను తొలగించాలని వ్యవసాయ రైతులు, పశుపెంపకం దారులుపశుపెంపకందారులు కోరుతున్నారు.