నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం భైరవరం ఎస్సీ కాలనీకి చెందిన కట్టా వెంకటేష్, లక్ష్మీదేవి దంపతుల మూడు నెలల పసికందు మృతిచెందింది. వ్యాక్సిన్తోనే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు.