దుత్తలూరు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం నందిపాడులో షేక్. కుబ్రా (18) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఏడు నెలల క్రితమే నందిపాడుకు చెందిన మహమ్మద్ రఫీతో ఆమె వివాహం జరిగింది. దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి మహిళ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్