డీసీ పల్లి పొగాకు వేలాల్లో రైతుల అసంతృప్తి

డీసీ పల్లి పొగాకు బోర్డులో పొగాకు వేలాలు ప్రారంభమై నెలరోజులు పూర్తయ్యాయి. వేలం నిర్వహణ అధికారి జి. సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 8 మంది కొనుగోలుదారులు 4,19,606 కిలోల పొగాకును కొనుగోలు చేశారు. గరిష్ఠంగా కేజీకి రూ. 250, కనిష్ఠంగా రూ. 210 ధర పలికింది. అయితే, ప్రస్తుత ధరలు సాగు ఖర్చులకు సరిపోవడం లేదని, గిట్టుబాటు ధరలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్