ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అనంతపురి గంగా భవాని అమ్మవారి జాతర సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిసింది. జాతర చివరి రోజున బండ్లకు ప్రత్యేక పూజలు, పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహించారు. జాతర జరిగిన అన్ని రోజులూ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, జాతర వేడుకలు విజయవంతంగా ముగిశాయి.