ఆత్మకూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని దేవదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఐదు కోర్సుల్లో 300 మంది విద్యార్థులకు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించనున్నారు. ఆత్మకూరులో భవనాలు నిర్మించేంతవరకు నెల్లూరులోని విఆర్ఐపిఎస్ కళాశాల భవనాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.