అనాథ వికలాంగురాలి ఇంటి ధ్వంసం.. న్యాయం చేయాలంటూ ఆవేదన

వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లిలో అనాథ వికలాంగురాలు సావిత్రి ఇంటి ముందు భాగం కూల్చివేయబడింది. ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి వచ్చిన ఆమె తన రేకుల షెడ్, గోడలు ధ్వంసమైనట్లు గుర్తించి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని ఆమె ఆరోపించింది. వికలాంగురాలైన బాధితురాలికి రక్షణ కల్పించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్