ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వింజమూరులో నిర్వహించిన సభకు సాయిపేట నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. వార్డు నంబర్లు 204, 205 పరిధిలోని ఓరుగుంట సుమన్, గంటా నరసింహులు నాయకత్వంలో ప్రజలు వాహనాల్లో బయలుదేరారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఈ సభకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందని కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.