ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకం కింద ఆయన కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సాయం అందింది. మంగళవారం గండిపాలెం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ నజీర్, మృతుడి భార్య షాహినాకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా 50 ఏళ్లలోపు ఖాతాదారులు సంవత్సరానికి రూ. 436 ప్రీమియంతో పథకంలో చేరాలని మేనేజర్ సూచించారు.