నర్రవాడలో ఫిబ్రవరి 3న జగన్నాథస్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు

నర్రవాడ శ్రీ శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ జగన్నాథస్వామి వారి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 2026 ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి విశేష పూజలు, అభిషేకాలు, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం 4 గంటలకు కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కమిటీ సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్