ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అని జలదంకి మండల టిడిపి నేత కరియావుల అప్పలనాయుడు తెలిపారు. కమ్మవారి పాలెం -పాత బిట్రగుంట రోడ్డు పనులకు గురువారం పూజ చేశారు. ఎన్నో ఏండ్లుగా గుంటలు పడి ప్రయాణికులకు అసౌకర్యంగా మారి అవస్థలు పడుతుండడంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకొని వెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రూ. 2 కోట్ల నిధులను విడుదల చేశారని ప్రజలు తెలిపారు.