జలదంకి: విద్యుద్ఘాతంతో పూరిల్లు దగ్ధం

విద్యుద్ఘాతంతో పూరిల్లు దగ్ధమైన ఘటన జలదంకి గిరిజన కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. కాలనీకి చెందిన పొట్లూరి శివ, భారతి దంపతులు వారం క్రితం ఇంటికి తాళం వేసి కూలి పనుల కోసం అన్నవరం వెళ్లారు. బుధవారం రాత్రి విద్యుత్ ఘాతంతో మంటలు వ్యాప్తి చెంది ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు రూ. 1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్