కాకర్ల సురేశ్ ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శన

శనివారం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 6 కోట్లతో ఆసుపత్రి ఆధునికీకరణకు చేపట్టనున్న అభివృద్ధి పనుల డిజైన్లను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బంది, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్