కార్తీక సోమవారం: శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి విశేష పూజలు

మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అర్చకులు సత్యం స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, నూతన వస్త్రధారణ, పుష్పాలంకరణ, కుంకుమార్చన, 1008 బిల్వార్చన అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్