కొండాపురం మండలంలోని పార్లపల్లి గ్రామానికి చెందిన జి. మేరీ అనే మహిళ కుల దూషణ చేశారని కొండాపురం పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. మేరీ కోడలు స్థానిక పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ గా ఉండి తల్లిదండ్రుల సమావేశానికి హాజరుకాగా మేరీ సైతం హాజరయ్యారు. వంట సక్రమంగా చేసి విద్యార్థులకు అందించాలని మేరి కోడలు నిర్వాహకులు సూచించారు. దీంతో వంట చేసే మహిళ కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేసింది.