కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామానికి చెందిన కందవరపు కొండయ్య ఆకస్మిక మృతికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం అందిన వెంటనే గ్రామానికి చేరుకుని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల కష్టాల్లో అండగా నిలవడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.