కొండాపురం మండలం గరిమెన పెంట పంచాయతీ చల్లావారిపాలెం గ్రామంలో బుధవారం నెల్లూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్యకు చెందిన జామాయిల్ తోట నిప్పుంటుకొని దగ్ధమైంది. బాధితుడు కృష్ణయ్య వివరాల ప్రకారం.. 15 ఎకరాల్లో జామాయిల్ తోట ఉందని.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటిచ్చారని తెలిపారు. రూ. 10 లక్షల మేర నష్టం జరిగిందని అన్నారు. అలాగే ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.