కొండాపురం మండలం సాయిపేట గ్రామ సమీప పొలాల్లో కోడిపందాల స్థావరంపై శనివారం పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు చేసి పెద్ద ఎత్తున నగదు, భారీగా బైకులు, కార్లు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే బైకులు విడిపించేందుకు స్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.