కొండాపురం నూతన ఎస్సైగా మాల్యాద్రి బాధ్యతలు

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం నూతన ఎస్సైగా జె. మాల్యాద్రి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి కొండాపురానికి ఆయన బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించేది లేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్