బుధవారం రాత్రి సీతారామపురం మండలం బసినేనిపల్లి పంచాయతీ పరిధిలోని సంజీవరెడ్డి నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు రహదారి దాటుతుండగా, ఉదయగిరి నుంచి సీతారామపురం వైపు వస్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.