ఉదయగిరి మండలంలో వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు

ఉదయగిరి మండలం తిరుమలపురం గిరిజన కాలనీకి చెందిన అల్లూరు వెంగమ్మ అనే వివాహిత అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 24న తన భార్య ఫోన్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలిపిందని, అనంతరం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని భర్త బాలవెంగయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బండ్లమూడి మహేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్