వరికుంటపాడు: ఘనంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్

వరికుంటపాడు మండలంలోని కనియంపాడు, తిమ్మారెడ్డిపల్లి, తూర్పు బోయమడుగుల, మంగాపురం, విరువూరు, వరికుంటపాడు గ్రామాల్లో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించారు. పాఠశాలలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సమావేశానికి విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, ప్రముఖులు ప్రసంగించారు. తల్లిదండ్రులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్