కలిగిరి మండలం పోలంపాడు గ్రామంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు.