దుత్తలూరు మండలం నందిపాడు కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో పరీక్షలకు హాజరైన 40 మంది విద్యార్థినులందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాన్ని సాధించారు. వీరిలో 9 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. డి. లక్ష్మి రిషిన్య 568 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, కే. భవ్య 555 మార్కులతో ద్వితీయ స్థానం, మనోజ్ఞ 538 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారని ప్రిన్సిపల్ ఎం. అంజనీ దేవి తెలిపారు.